వాళ్ళను ఘోరంగా అవమానించారు : రామచంద్ర గుహ

SMTV Desk 2017-07-17 14:23:01  Dravid, and, Zaheer, have, insulted, BCCI

ముంబాయి, జూలై 17 : భారత జట్టు మాజీ కోచ్ అనిల్ కుంబ్లే లాగానే ద్రావిడ్, జహీర్ లను కూడా బీసీసీఐ ఘోరంగా అవమానించిందని సీవోఏ సభ్యుడు రామచంద్ర గుహ ఆగ్రహం వ్యక్తం చేసారు. రామ చంద్ర గుహ... ' బీసీసీఐ సహాయక కోచ్ లుగా వాళ్ళ పేర్లను బయటకు తీసుకువచ్చి, ఇప్పుడు వెనక్కి వెల్లడమేంటని అని విమర్శించారు. భారత జట్టులో అనిల్ , ద్రావిడ్, జహీర్ లు నిజమైన క్రికెట్ దిగ్గజాలు. మైదానంలో వాళ్ళు ఎన్నో రికార్డులు సృష్టించారు. అనిల్ కుంబ్లే కోచ్ గా భారత జట్టుకు ఎన్నో మంచి విజయాలు అందించారు. ద్రావిడ్ ప్రస్తుతం అండర్ 19 భారత్ ఏ జట్టు కోచ్ గా వ్యవహరిస్తూ కుర్రాళ్ళను తీర్చిదిద్దుతున్నారు. బౌలింగ్ లో జహీర్ ఖాన్ కు అపార అనుభవం ఉంది. అలాంటి వాళ్ళని బీసీసీఐ అవమాన పరిచింది.' అని ఆయన ట్విట్టర్ ద్వారా విమర్శించారు.