రాష్ట్రపతి ఎన్నికకు సీఎం కేసీఆర్ ఓటు....

SMTV Desk 2017-07-17 13:28:38  cm kcr, president elections, Assembl

హైదరాబాద్, జూలై 17 : రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ కమిటీ హాలులో ఎన్నికల పోలింగ్ ప్రారంభం అవ్వడంతో , రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. తదుపరి స్పీకర్ మధుసూదనాచారి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, కోమటిరెడ్డి, గీతారెడ్డి, తదితర శాసనసభ్యులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా నాయకుల సెల్‌ఫోన్‌లు, పెన్నులను అధికారులు పోలింగ్ బూత్‌లోకి అనుమతించలేదు. అంతకు ముందు టీఆర్‌ఎస్ భవన్‌లో ఓటింగ్‌ విధానంపై ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. తెలంగాణ భవన్ నుంచి టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు, మంత్రులు మూడు బస్సుల్లో అసెంబ్లీకి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.