అఖిల్ బాలీవుడ్ సినిమా

SMTV Desk 2018-08-25 11:09:14  Akhil , Bollywood, Karan Johar, King Nagarjuna

అక్కినేని నట వారసుడిగా భారీ అంచనాల మధ్య సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో అఖిల్. తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్, రెండో ప్రయత్నంగా తెరకెక్కిన హలోతో పరవాలేదనిపించాడు. ప్రస్తుతం తొలి ప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. అఖిల్‌ తన నెక్ట్స్ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ క్రేజీ నిర్మాత కరణ్ జోహార్ ఓ సినిమాను అఖిల్ హీరోగా నిర్మించబోతున్నారు. హీరో ఆది పినిశెట్టి సోదరుడు సత్య తయారుచేసిన ఓ లైన్ అఖిల్ ద్వారా తెలుసుకున్న కరణ్ జోహార్ ఇద్దరు స్క్రిప్ట్ అసిస్టెంట్లను ఇచ్చి, పూర్తి బౌండ్ స్క్రిప్ట్ చేయించారట. ఇప్పుడు ఆ సినిమాను తెలుగు హిందీ భాషల్లో తెరకెక్కిస్తారు. ఈ సినిమా మొత్తం గుర్రపు పందాల చుట్టూ తిరుగుతుంది. అఖిల్ కు ఓ గుర్రం అపురూపనేస్తంగా వుంటుంది. గుర్రపు. పందాల గురించి, ఆ టెర్మినాలజీ, ఇతరత్ర వ్యవహారాల గురించి డైరక్టర్ సత్య బాగా రీసెర్చి చేసి, స్క్రిప్ట్ తయారుచేసాడట. ఇది బాగా రావడంతో, అఖిల్ నాలుగో సినిమాగా అందించబోతున్నారు. మలుపు సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్య ప్రభాస్‌ తన నెక్ట్స్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాడు. అఖిల్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కింగ్ నాగార్జున, కరణ్‌ జోహర్‌లు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించనున్నారట. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా, అఖిల్‌ బాలీవుడ్ ఎంట్రీపై జోరుగా ప్రచారం జరుగుతోంది.