విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

SMTV Desk 2018-08-24 16:40:07  Virat Kohli, Virat Kohli records

విరాట్‌ కోహ్లి నాయకుడిగా మరో మెట్టు ఎక్కేశాడు. బ్యాట్స్‌మన్‌గా తిరుగులేని రికార్డులు నెలకొల్పుతూ దూసుకెళ్తోన్న సూపర్‌ స్టార్‌ తాజాగా నాయకుడిగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో అనితర సాధ్య విజయాలు సాధించిన బ్రాడ్‌మన్‌, రికీ పాంటింగ్‌లను కోహ్లి నాటింగ్‌హామ్‌లోనే వెనక్కి నెట్టేశాడు. నాటింగ్‌హామ్‌లో వరుసగా 97, 103 పరుగులతో జట్టు విజయానికి వెన్నెముకలా నిలిచిన విరాట్‌.. జట్టు విజయాల్లో 200 ప్లస్‌ పరుగులు అత్యధిక సార్లు చేసిన కెప్టెన్‌గా నిలిచాడు. జట్టు విజయాల్లో కెప్టెన్‌గా బ్రాడ్‌మన్‌, పాంటింగ్‌లు చెరో ఆరు పర్యాయాలు 200 పైచిలుకు పరుగులు సాధించారు. కానీ కెప్టెన్‌గా 38వ టెస్టులోనే కోహ్లి దిగ్గజాల రికార్డులను చెరిపేశాడు. నాటింగ్‌హామ్‌లో చేసిన 200 పరుగులతో జట్టు విజయాల్లో 200 పైచిలుకు పరుగులు కోహ్లిది ఏడోది. 2016లో వెస్టిండీస్‌పై నార్త్‌సౌండ్‌లో 200 (తొలి ఇన్నింగ్స్‌లోనే డబుల్‌ సెంచరీ), ఇండోర్‌లో న్యూజిలాండ్‌పై 228( 211, 17), విశాఖపట్నంలో ఇంగ్లాండ్‌పై 248 (167, 81), ముంబయిలో ఇంగ్లాండ్‌పై 235 (తొలి ఇన్నింగ్స్‌లో ద్వి శతకం), హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై 242 (204, 28), నాగ్‌పూర్‌లో శ్రీలంకపై 213 (తొలి ఇన్నింగ్స్‌లోనే ద్వి శతకం) కోహ్లి చితక్కొట్టాడు. తాజాగా నాటింగ్‌హామ్‌లో మరోమారు 200 ప్లస్‌ పరుగులు పిండుకున్నాడు