ప్రొఫెసర్ జయశంకర్ బయోపిక్

SMTV Desk 2018-08-24 15:44:24  Professor Jaya Shanker, Biopic,

‘మహానటి’ మూవీ స్పూర్తితో తెలుగులో బయోపిక్ మూవీల హవా నడుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్ఆర్, కె. విశ్వనాథ్ బయోపిక్ చిత్రాలు సెట్స్‌పై ఉండగా.. సిల్క్ స్మిత, ఏఎన్నార్, డి రామానాయుడు ఇలా చాలా మంది మేటి రాజకీయ, సినీ ప్రముఖుల జీవిత చరిత్రలను వెండితెరపై ఆవిష్కరించేందుకు దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ కూడా చేరారు. ఎన్.శంకర్ దర్శకత్వం వహిస్తూ, మహాలక్ష్మీ ఆర్ట్ బ్యానర్‌పై ఆయనే నిర్మించనున్నారు. తెలంగాణ సమాజంలో స్ఫూర్తి నింపే ప్రయత్నంలో భాగంగా జయశంకర్ సార్ బయోపిక్ తియ్యబోతున్నాను. కొన్నాళ్లుగా పొయిటిక్‌గా ఓ సినిమా తియాలని ఆలోచన ఉంది. జ్ఞానవంతుడు, ధైర్యవంతుడైన ఆయన కథ అందుకు సరైనదని అనిపించింది. త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తాం. నా సొంత బ్యానర్‌లో వస్తున్న మూడో చిత్రమిది’ అని దర్శక నిర్మాత ఎన్‌.శంకర్‌ పేర్కొన్నారు.