హైదరాబాద్ - విశాఖపట్నం మధ్య మరో విమాన సర్వీసు

SMTV Desk 2017-05-29 19:09:58  aeroplane spicejet

హైదరాబాద్, మే 29 : హైదరాబాద్- విశాఖపట్నం మధ్య ఇంకో విమాన సర్విస్ అందుబాటులోకి రానుంది. జూలై 1 నుంచి ఈ విమాన సర్విస్ ను ప్రారంభించనున్నట్లు స్పైస్ జెట్ సంస్థ ఈ ఆదివారం ప్రకటన చేసింది. ఇప్పటికే ఈ రెండు నగరాల మధ్య స్పైస్ జెట్ సంస్థ ఓక విమాన సర్వీసు కొనసాగుతున్నప్పటికి ప్రయాణికుల రద్ది ఎక్కువగా ఉండడం వలన ఇంకో సర్విస్ ను ప్రారంభిస్తున్నట్లు స్పైస్ జెట్ సంస్థ వారు తెలిపారు. ఈ విమాన సర్వీసు హైదరాబాద్ నుండి 7-20 నిమిషాలకు బయల్దేరి, విశాఖపట్నం కు 8-20 నిమిషాలకు చేరుకుంటుంది. మళ్ళీ విశాఖపట్నం నుంచి 8-40 నిమిషాలకు బయల్దేరి హైదరాబాద్ కు 9-40 నిమిషాలకు చేరుకుంటుంది ఆ సంస్థ వారు వివరించారు.