రిలయన్స్ ఇండస్ట్రీస్ అరుదైన రికార్డ్

SMTV Desk 2018-08-23 17:34:22  Reliance industries, Mukesh Ambani

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం మరో ఘనతను సొంతం చేసుకుంది. తొలిసారి ఆ సంస్థ మార్కెట్ విలువ రూ.8 లక్షల కోట్లను తాకింది. గురువారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో ఆర్‌ఐఎల్ షేరు విలువ రూ.1262.50కు చేరుకుంది. షేరు ధర ఒక్కరోజే రూ.16 పెరిగింది. దీంతో రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.8,00,128.29 కోట్లకు చేరుకుంది. ఇది మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారులు రిలయన్స్ షేర్లను కొనుగోలు చేసుకుంటూ పోతున్నారు. రిలయన్స్ జియో గిగాఫైబర్, జియో ఫోన్2 సర్వీసుల నుంచి అధిక ఆదాయం లభించే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేర్లకు గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. ఆకర్షణీయమైన టారిఫ్ ప్లాన్లు, పెరుగుతున్న ఖాతాదారుల నేపథ్యంలో మార్జిన్స్ ఒక్కసారిగా పెరిగాయి. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం జూన్‌లో రిలయన్స్ జియో 9.71 మిలియన్ యూజర్లను చేర్చుకుంది. దీంతో జియో మొత్తం యూజర్ల సంఖ్య 215 మిలియన్లకు చేరుకుంది. అలాగే నెల రోజుల క్రితం 18.7 శాతం ఉన్న మార్కెట్ షేర్ ఇప్పుడు 18.78 శాతానికి చేరుకుంది.