ప్రత్యేక హోదా వారికి కొనసాగుతుంది

SMTV Desk 2018-07-26 19:02:59  bjp mp, scs, special category status

న్యూఢిల్లీ, జూలై 26 : రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు హోదా ద్వారా ప్రయోజనాలు పొందుతున్నాయని కేంద్రం పేర్కొంది. ఇప్పటి వరకూ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. ఆ రాష్ట్రాలకు హోదాను అలాగే కొనసాగిస్తామని పేర్కొంది. కేంద్ర ప్రయోజిత పథకాలలో హోదా కలిగిన 11 రాష్ట్రాలకు 90:10 ప్రకారం నిధులు అందుతున్నాయని సమాధానమిచ్చింది. విదేశీ సహాయ ప్రాజెక్టులు(ఈఏపీ) కింద వచ్చే నిధులను 90శాతం ఈశాన్య రాష్ట్రాలకు, హిమాలయ రాష్ట్రాలకు గ్రాంటుగా అందజేస్తున్నట్లు స్ఫష్ట చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు (2015-2020) వరకు 22,112కోట్ల రెవెన్యూలోటు ఉంటుంన్నట్లు 14వ ఆర్థిక సంఘం తేల్చిందని పేర్కొన్నారు. జాతీయ అభివృద్ధి మండలి ద్వారా మంజూరయ్యే స్పెషల్‌ స్టేటస్‌లో ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఉండవని మరో ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.