డ్రగ్స్ వల్ల చిత్రసీమకు చెడ్డ పేరు వస్తుంది: కవిత

SMTV Desk 2017-07-17 11:19:11  drugs,racket,pratani,ramakrishna,goud,akun,shabhawal,kavitha,

హైదరాబాద్, జూలై 17 : తెలుగు చిత్రసీమలోని కొందరు ప్రముఖులకు డ్రగ్స్ రాకెట్ వ్యవహారం నోటీసులు రావడం తో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన డ్రగ్స్ సమస్యపై రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ... డ్రగ్స్ కేసులో బడా నిర్మాతల పిల్లలకు బదులు ఇతరుల పేర్లు వస్తున్నాయని కొందరు విమర్శించడం కరెక్ట్ కాదని అయన అన్నారు. ప్రభుత్వం ఈ విషయం పై సీరియస్ గా ఉందని, ఎక్సైజ్‌ డీజీ అకున్ సబర్వాల్ ఈ కేసును చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తునారన్నారు. నోటీసులు అందుకున్న వారందరూ దోషులు కారు. తప్పు చేయనివారికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌ సపోర్ట్ గా ఉంటుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ కవిత అన్నారు. కొందరి వల్ల తెలుగు చిత్రసీమకు చెడ్డ పేరు వస్తుందన్నారు. డ్రగ్స్ పంపిణీ చేసే పబ్ లను తక్షణం మూసివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సినిమా అవకాశాలు రాలేదని డ్రగ్స్ కు బానిసలు కావడం సరికాదని తప్పు చేసినవారు ఎవరైనా సరే శిక్షింపబడతారు.