శ్రీరెడ్డి ఆరోపణల్లో నిజం లేదు : కార్తి

SMTV Desk 2018-07-19 19:06:45  sreerddy, hero karthi, kolivud news, sreereddy comments on vishal.

చెన్నై, జూలై 19 : నటి శ్రీరెడ్డి.. టాలీవుడ్ లోని ప్రముఖ వ్యక్తులను టార్గెట్ చేస్తూ వారిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వస్తోంది. టాలీవుడ్ లో తనను ఎవరు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ లోని వ్యక్తులను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో మురుగదాస్, లారెన్స్, శ్రీరామ్(శ్రీకాంత్)పై ఆమె ఆరోపణలు చేయడమే కాకుండా.. హీరో విశాల్ వైపు నుంచి తనకు బెదిరింపులు ఉంటాయేమోననే అనుమానాలను శ్రీరెడ్డి వ్యక్తం చేసింది. దీంతో ఇప్పుడు కోలీవుడ్ అంతా ఈ విషయంపైనే మాట్లాడుకుంటున్నారు. తాజాగా శ్రీరెడ్డి ఆరోపణలపై కథానాయకుడు కార్తి స్పందించారు. ఆయన నడిగర్‌ సంఘానికి కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో తమిళ నటులపై శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తుండడంతో ఆయన ప్రస్తావించాల్సి వచ్చింది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. నేను ఈ విషయం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం, సాక్ష్యం ఉంటే ఆమె పోలీసులను ఆశ్రయించాలి. అది వదిలేసి ఇలా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడం కరెక్ట్ కాదు. అసలు ఈ విషయాన్ని పెద్దదిగా చేసి చూపించాలా? వద్దా? అన్నది మీడియా వర్గాలు ఆలోచించుకోవాలి" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.