అగ్రస్థానం మరింత మెరుగుపరుచుకున్న కోహ్లి..

SMTV Desk 2018-07-19 18:35:43  virat kohli, virat odi top rank, icc, india

దుబాయ్‌, జూలై 19 : టీమిండియా క్రికెట్ సారథి విరాట్‌ కోహ్ల వన్డేల్లో తన అగ్రస్థానాన్ని మరింత పదిల పరుచుకున్నాడు. బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లో అత్యధికంగా 911 పాయింట్లకు చేరుకున్నాడు. 1991లో డీన్‌జోన్స్‌ 918 పాయింట్లకు చేరుకున్న తర్వాత వన్డేల్లో ఓ బ్యాట్స్‌మన్‌ అత్యధికంగా సాధించిన పాయింట్లు ఇవే. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో కోహ్లి వరుసగా 75, 45, 71 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో రెండు శతకాలు చేసిన ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జో రూట్‌ (819) కెరీర్‌లోనే అత్యుత్తమంగా రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ కెరీర్‌లో తొలిసారి టాప్‌-10లోకి దూసుకెళ్లాడు. అతడు ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానం సాధించాడు. బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. చాహల్‌ పదో స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్ రౌండర్ విభాగంలో బంగ్లాదేశ్ ఆటగాడు షకిబ్ అల్ హసన్ మొదటి స్థానంలో నిలిచాడు.