సంప్రదాయ దుస్తులైన ధోతి తో మాల్ కి వెళ్లినందుకు...

SMTV Desk 2017-07-16 14:22:35  KOLKATA , MALL ,DENIES , ENTRY , MAN ,WEARING ,DHOTI

న్యూఢిల్లీ, జూలై 16: భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి తీవ్ర పరాభావపాలు అయ్యారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలోని క్వెస్ట్ మాల్ అనే సంస్థ యాజమాన్యం ధోతి ధరించిన వ్యక్తిని లోనికి రానివ్వకుండా అడ్డుకుంది. ప్రతి ఒక్కరిని మాల్ ప్రవేశద్వారం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేసి లోపలకు పంపించే విషయం తెలిసిందే. అందరిలానే ఆ ధోతీ ధరించిన వ్యక్తి కూడా సెక్యూరిటీ దగ్గరకు వెళితే ఆ సంస్థలోని యాజమాన్యం ఆయన వద్దకు వచ్చి ధోతి ధరించిన వ్యక్తులకు మాల్ లోకి ప్రవేశం లేదంటూ నిలిపివేశారు. అది విన్న ఆ వ్యక్తి నివ్వెరపోయారు. ఆయన వెంట ఉన్న స్నేహితురాలు, కోల్ కతాకు చెందిన నటి దేబ్ లీన సేన్ ఈ తతంగమంతా వీడియో లో తీసి ఫేస్ బుక్ పోస్టు చేశారు. ధోతి, లుంగీ ధరించిన వ్యక్తులను లోపలికి అనుమతించబోమని మాల్ యాజమాన్యం చెపుతుందని ఫేస్ బుక్ పోస్టులో ఆమె తెలిపారు. గత నెలలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. సంప్రదాయ దుస్తులు ధరించారని ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ మహిళను ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ యాజమాన్యం లోపలికి అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారు.