సింగర్ ను కౌగిలించుకున్నందుకు.. 18 లక్షలు జరిమానా..!

SMTV Desk 2018-07-17 16:40:25  Iraqi-Saudi performer Majid al-Mohandis , saudi arabia, riyad, gulf country

రియాద్‌, జూలై 17 : గల్ఫ్ దేశాల్లో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. ఇరాకీ సింగర్ మజిద్ ఆల్ ముహాన్ దిన్ కు గల్ఫ్ దేశాల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో రియాద్ లో రెండు రోజుల క్రితం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముహాన్ దిన్ అద్భుతంగా పాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన బురఖా ధరించిన ఓ యువతి ఆ పాటలను ఎంతో ఆస్వాదించింది. సంతోషం పట్టలేక వేదికపైకి వెళ్లి సింగర్ ముహాన్ దిన్ ని కౌగిలించుకుంది. అయితే పాప్‌ సింగర్‌ను వేదికపై కౌగిలించుకున్నందుకు గాను ఓ యువతికి రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సదరు యువతిపై వేధింపుల కేసు నమోదు చేశారు. బలవంతంగా సింగర్‌ను కౌగిలించుకున్నందుకు గాను ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో పాటు రూ.18లక్షల జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.