పాముతో డాన్స్ చివరికి ఇలా....

SMTV Desk 2017-07-16 12:22:15  utthara pradesh, men, dance, snake, music system, dance bharath,

లక్నో, జూలై 16 : ఒక యువకుడు పామును మెడలో వేసుకుని డాన్స్ చేస్తూ పాము కాటుకు గురై మృతిచెందిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని ఖుడానా గ్రామంలో రాత్రి ఒంటి గంట సమయంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. ఈ సందర్భంగా డీజే లో నాగిని మ్యూజిక్ ప్లే చేయగా పక్కనే ఉన్న పొలాలలో నుంచి ఒక పాము అక్కడున్న వారి మధ్యలోకి వచ్చేసింది. దానిని చూసిన ఓ యువకుడు పామును తన మెడలో వేసుకుని ఉత్సాహంగా నృత్యం చేయసాగాడు. ఇంతలో పాము పట్టుతప్పి కింద పడిపోయింది. దీంతో మళ్లీ పామును తన మెడలో వేసుకుని తిరిగి డాన్స్ చేస్తుండగా, పాము ఉన్నట్టుండి అతన్ని కాటువేసి చల్లగా జారుకుంది. దీనిని గమనించిన అక్కడివారు అతడిని వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.