స్కూల్స్ లల్లో జామర్లు

SMTV Desk 2017-07-16 12:15:04  schools, jamars, students, porography, central government, supreem court

న్యూఢిల్లీ, జూలై 16 : అశ్లీల వెబ్ సైట్ల అరాచకం తక్కువ చేసే నేపథ్యంలో పాఠశాలలకు జామర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. అయితే విద్యార్ధులు అశ్లీల వెబ్ సైట్ల జోలికి వెళ్లకుండా పాఠశాలల ప్రాంగణాల్లో జమార్ల ఏర్పాటుకై అవకాశాలను పరీశిలిస్తున్నామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇంతకు ముందు కోర్టుకు చెప్పిన విధంగా స్కూల్ బసుల్లో వీటిని అమర్చడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. జస్టిస్ దీపక్ మిశ్రా, ఏఎం ఖాన్ విల్కర్, ఎంఎం శంతనగౌడర్ తో కూడిన ధర్మాసనానికి అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్, న్యాయవాది రాజేశ్ రంజాన్ ప్రభుత్వ ప్రయత్నాలను వివరించారు. జామర్ల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని సీబీఎస్ ఈ ని కోరామని వారు తెలిపారు. చైల్డ్ పోర్నో గ్రఫీ వెబ్ సైట్లకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ గత నెలలో 3500 సైట్ల ను నిరోధించామని చెప్పారు. ఈ విషయంపై కేంద్రం ఇంటర్ పోల్ సహకారం కోరిందని, సీబీఐ ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. చైల్డ్ పోర్న్ గ్రఫీ సైట్లను పూర్తిగా నిషేధించాలని కోరుతూ కమలేశ్ వాస్వాని దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల వీడియోలు చూస్తే వారిని శిక్షించేందుకు వీలుగా కూడా చట్టం రూపొందించాలని పిటీషన్ తరపు న్యాయవాది విజయ్ పంజ్వానీ అన్నారు.