సూపర్ స్టార్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేశాడు..

SMTV Desk 2018-07-16 14:26:25  supar star rajinikanth, karthik subbaraju, malayala actor fahad phajil.

చెన్నై, జూలై 16 : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. కార్తీక్ సుబ్బరాజ్ దర్శత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కొంతభాగం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో రజినీ సరసన సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కూడా ఓ ముఖ్య భూమిక పోషిస్తుంది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా ఇందులో ఓ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. అయితే తాజాగా మరో ముఖ్యమైన పాత్ర కోసం మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మలయాళ ప్రేక్షకుల హృదయాల్లో సహజ నటుడిగా ఫాహద్ ఫాజిల్ మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో ఆయనను ఈ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. మరి సూపర్ స్టార్ రజనీ సినిమాలో ఫాహద్ తన ప్రత్యేకతను ఎలా చాటుకుంటాడో వేచి చూడాలి.