ఫిఫా -2018: విశ్వ విజేత ఫ్రాన్స్..

SMTV Desk 2018-07-16 11:10:20  #fifa-2018 winner, fifa winner france, france vs craotia, russia

మాస్కో, జూలై 16 : ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్-2018 ను ఫ్రాన్స్ జట్టు ఎగేరేసుకుపోయింది. టోర్నీలో భాగంగా లుజ్నికి స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో ఫ్రాన్స్‌ 4–2 గోల్స్‌ తేడాతో క్రొయేషియాను చిత్తు చేసింది. తొలిసారి ఫైనల్‌ చేరి ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన క్రొయేషియాకు తుది ఫలితం చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. క్రొయేషియా ఆటగాడు మంజుకిచ్‌ సెల్ఫ్‌ గోల్‌ (18వ)తో ఖాతా తెరిచిన ఫ్రాన్స్‌కు గ్రీజ్‌మన్‌ (38వ, పెనాల్టీ), పోగ్బా (59వ), ఎంబపె (65వ) తలో గోల్‌ అందించారు. క్రొయేషియా తరఫున పెరిసిచ్‌ (28వ), మంజుకిచ్‌ (69వ) చెరో గోల్‌ చేశారు. ఆటగాడు, కోచ్‌గా ప్రపంచచకప్పు గెలిచిన మూడో వ్యక్తిగా ఫ్రాన్స్‌ కోచ్‌ డెషాంప్స్‌ ఘనత సాధించాడు. విజేత ఫ్రాన్స్‌ జట్టుకు 3 కోట్ల 80 లక్షల డాలర్లు (రూ. 260 కోట్లు).. రన్నరప్‌ క్రొయేషియా జట్టుకు 2 కోట్ల 80 లక్షల డాలర్లు (రూ. 191 కోట్లు) దక్కింది. జగాలో (బ్రెజిల్‌), బ్రెకన్‌బాయర్‌ (జర్మనీ) తర్వాత అటు కెప్టెన్‌గా, ఇటు కోచ్‌గా కూడా వరల్డ్‌ కప్‌ సాధించిన మూడో ఆటగాడు దిదియర్‌ డెచాంప్స్‌. 1998 అతని నాయకత్వంలోనే సొంతగడ్డపై ఫ్రాన్స్‌ వరల్డ్‌ కప్‌ నెగ్గింది. అవార్డులు : >> గోల్డెన్ బూట్: హ్యారీకేన్ (ఇంగ్లాండ్) >> గోల్డెన్ బాల్ : లూకా మోద్రిచ్( క్రొయేషియా) >> గోల్డెన్ గ్లోవ్ : కోర్ట్ వా ( బెల్జియం) >> యంగ్ ప్లేయర్: ఎంబపే (ఫ్రాన్స్) >> ఫెయిర్ ప్లే : స్పెయిన్