థాయ్‌ ఓపెన్‌ ఫైనల్లో సింధు ఓటమి..

SMTV Desk 2018-07-15 17:36:24  Thailand Open Badminton, p.v sindhu vs Okuhara, PV Sindhu loses, japan

బ్యాంకాక్, జూలై 15 ‌: తెలుగు తేజం పీవీ సింధు థాయ్‌ల్యాండ్‌ బ్యాడ్మింటన్‌ ఓపెన్‌ సిరీస్‌ ఫైనల్లో ఓటమి పాలైంది. జపాన్‌ క్రీడాకారిణి, టెక్నిక్ పరంగా తనకన్నా మెరుగైన నజోమీ ఒకుహర చేతిలో 21-15, 21-18 తేడాతో వరుస గేముల్లో ఓటమి చవిచూసింది. సింధు గెలుపు కోసం తన పోరాటాన్ని కొనసాగించింది. రెండు గేముల్లోనూ ఒకుహర ఆధిక్యంలోనే కొనసాగింది. తొలిగేమ్‌లో 6-3తో ముందంజలో ఉన్న ఆమెను చేరుకునేందుకు సింధు తీవ్రంగా పోరాడింది. అయితే ఒకుహర ప్రతిసారీ రెండు పాయింట్ల ఆధిక్యంలోనే కొనసాగుతూ వచ్చింది. 18-15తో ఉన్న ఆమె వరుసగా 5 పాయింట్లు సాధించి తొలి గేమ్‌ కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో తొలుత 6-2తో సింధు ఆధిపత్యం కొనసాగించింది. ఈ క్రమంలో పుంజుకున్న ఒకుహర 7-7, 9-9, 14-14, 18-18తో ఆమె ఆధిక్యాన్ని సమం చేస్తూ వచ్చింది. చివర్లో సింధును ఒత్తిడిలోకి నెట్టేసి 21-18తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కుంచుకొంది. వీరిద్దరూ ఇప్పటి వరకు 11 సార్లు తలపడగా ఒకుహర 6 సార్లు విజయం సాధించింది.