ప్రియురాలి ఆత్మహత్య...

SMTV Desk 2017-07-15 18:58:37  lovers,sucide,chennai,

చెన్నై: జూలై 15 : తమిళనాడు కడలూరు సమీపంలో కొండూరు గ్రామంలో ఓ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుణ (26) అలియా దర్శన్ రైల్వే పోలీసుగా పనిచేస్తున్నాడు. గుణ అదే గ్రామానికి చెందిన కాయల్ విలి (23) లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.వీరి ప్రేమకు అమ్మాయి తల్లితండ్రులు ఒప్పుకోలేదు. దీంతో విరక్తి చెందిన కయల్ విళి గురువారం మద్యానం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మృతికి తట్టుకోలేక ప్రియుడు దర్శన్ కూడా అదే రోజు చోళన్‌ ఎక్స్‌ ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి ఆత్మహత్యతో రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.