శేఖర్ కమ్ముల చిత్రం ఫిదా...

SMTV Desk 2017-07-15 18:41:11   FIDAA , SEKHAR KAMMULA , VARUN TEJ , SAI PALLAVI , SENSOR MEMBERS

హైదరాబాద్, జూలై 15 : తెలుగు డైరెక్టర్లల్లో అరుదుగా వినిపించే పేరు శేఖరు కమ్ముల.. ఈయన తీసేవి తక్కువ చిత్రాలే అయిన, మధురానుభూతి కలిగించే అందమైన దృశ్యకావ్యాలుగా మలచడంలో ఆయనకు సాటి ఎవరురాలేరు. చిత్రాల్లో సాధారణంగా కనిపించే హింస, అశ్లీలత మొదలైనవి శేఖర్ తీసే సినిమాల్లో చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా, ముఖ్యంగా తెలుగుదనం ఉట్టి పడేలా చిత్రీకరిస్తుంటారు. ఎవరైనా సరే ఆయన సినిమా చూసిన తరువాత ఫిదా అవాల్సిందే. ప్రస్తుతం ఆయన డైరెక్షన్ లో 8వ చిత్రం ఫిదాతో అందరిని మరోసారి ఫిదా చేయడానికి ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా కూడా ఆయన మార్క్ మూవీనే అని అంటున్నారు. ఫీల్ తో కూడిన ఆయన సినిమాలను చూడటానికి చాలామంది ఇష్టపడుతుంటారు. సెన్సార్ మెంబెర్స్ కూడా సినిమా చూసి హ్యాపీగా ఫీలయ్యారని నిర్మాత దిల్ రాజు తెలిపారు. తన సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ యు సర్టీఫికేట్ ఇచ్చిందని శేఖర్ కమ్ముల ఆనందంగా ఉన్నారట. ఈ నెల 21న భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. తమ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నామని దిల్ రాజు వెల్లడించారు. వరుణ్ తేజ్, సాయి పల్లవి ప్రధాన పాత్ర్రాలలో రూపొందిన ఈ చిత్రానికి శక్తికాంత్ సంగీతం అందించాడు.