నామా నాగేశ్వ‌ర‌రావు.. బిజేపిలోకా...?

SMTV Desk 2017-07-15 18:17:02  AP, CM, Chandrababu Naidu, will, join, BJP

ఖ‌మ్మం, జూలై 15 : రోజుకో మలుపు తిరుగుతున్నఖ‌మ్మం జిల్లా రాజకీయాన్ని ప్రస్తుతం మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు శాసిస్తున్నారు. ఇక కాస్తో కూస్తో సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాలల్లో ప‌ట్టు నిలుపుకుంటున్నాయి. ఇక జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటున్న కీలక నేత, మ‌ధుకాన్ కంపెనీల అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబుకు స‌న్నిహితుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కూడా పార్టీ మారాల‌ని భావిస్తున్న‌ట్టు సమాచారం. బీజేపీలో చేరి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారని వినికిడి. 2004లో ఎంపీగా పోటీ చేసిన నామా నాగేశ్వ‌ర‌రావు రేణుకా చౌద‌రి చేతిలో ఓడిపోగా, 2009 ఎన్నిక‌ల్లో రేణుకా చౌద‌రిపై 22 వేల మెజార్టీతొ ఘనవిజయం సాధించారు.