ఎమ్మెల్సీ పదవులకు ఎంపికైన వారు ?

SMTV Desk 2017-07-15 17:36:07  Employed, in, the, posts, of, MLC

అమరావతి, జూలై 15 : త్వరల్లో గవర్నర్ కోటాలో భర్తీ కానున్న రెండు ఎమ్మెల్సీ పదవులను సిఎం చంద్రబాబు నాయుడు ఎవరికి కేటాయిస్తారు.? అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ పదవుల కోసం తెలుగు తమ్ముళ్ళు పోటీ పడుతున్నారని సమాచారం వచ్చేసింది. అయితే ఇప్పటికే ఈ విషయంలో బాబు ఒక అభిప్రాయానికి వచ్చేశారనే మాట వినిపిస్తోంది. ఈ రెండు ఎమ్మెల్సీ పదవులను నంద్యాలకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఫరూక్, జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత రామసుబ్బారెడ్డి లకు బాబు ఎంపిక చేయనున్నారని సమాచారం.