నీ నిజమైన మానసిక బలం.. పాజిటివిటీ

SMTV Desk 2018-07-11 18:25:22  sonali bindre, anand mahindra, sonali injured to cancer.

ముంబై, జూలై 11 : ప్రముఖ నటి సోనాలి బింద్రే హైగ్రేడ్‌ క్యాన్సర్‌ సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె చికిత్స నిమిత్తం న్యూయార్క్‌ లో ఉన్నారు. ప్ర‌స్తుతం న్యూయార్క్‌లోని ఓ హాస్పిట‌ల్‌లో ఉన్న సొనాలీ.. చికిత్స నిమిత్తం జుట్టు క‌త్తిరించుకున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. "క‌ష్టాలు వ‌చ్చిన‌పుడే మ‌న‌లో దాగి ఉన్న శ‌క్తి బ‌య‌ట‌కు వ‌స్తుంది. నిజానికి విషాద‌క‌ర స‌మ‌యాల్లోనే మ‌నుషులు అద్భుతాలు చేస్తారు. కొన్ని రోజులుగా ప్రతి ఒక్కరు నాపై కురిపిస్తున్న ప్రేమ‌కు, ఆప్యాయ‌త‌కు ధ‌న్య‌వాదాలు. ఈ విశాల ప్ర‌పంచంలో నేను ఒంట‌రిదాన్ని కాద‌నే భావ‌న నాలో కొత్త ఆశ‌ల‌ను క‌లిగిస్తోంది" అంటూ ఎంతో భావోద్వేగంతో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సోనాలీ ట్వీట్‌ ను ఉద్దేశించి ఆనంద్‌ మహింద్రా ట్వీట్‌ చేశారు. "సోనాలి.. నీ నిజమైన మానసిక బలం, పాజిటివిటీ ఈ న్యూలుక్‌లో ప్రకాశిస్తోంది. రచయిత రిచార్డ్‌ రోర్‌ మాటల్లో చెప్పాలంటే మీరు పైకి ఎదగడానికి కింద పడుతున్నారు. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు" అంటూ ఆమెకు మనోదైర్యన్నిచ్చారు.