ఓ అభిమానికి స్కర్ట్ తొడిగిన టెన్నిస్ స్టార్...

SMTV Desk 2017-07-15 17:29:10  KIM CLIJSTERS , WHITE SKIRT , MAKES MALE , WIMBLEDON ,

లండన్, జూలై 15 : వింబుల్డన్ లో ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. ఇన్విటేషనల్ డబుల్స్ మ్యాచ్ లో మాజీ ఛాంపియన్ కిమ్ క్లిస్టర్స్ ఉమెన్స్ డబుల్స్ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో ఓ పాయింట్ కొట్టే సమయంలో ఆమె సరదాగా ఇది ఎక్కడ కొట్టాలని ఫాన్స్ ను అడిగింది. అప్పుడు స్టాల్స్ లో నుంచి వీక్షిస్తున్న ప్రేక్షకుడు గట్టి శద్దం చేస్తూ బాడీ మీద అంటూ అరిచాడు. అది విన్న ఆమె వెంటనే ఆ వ్యక్తిని మ్యాచ్ ఆడలంటూ గ్రౌండ్ లోకి అతన్ని పిలిచింది. అయితే అతను కూడా ధైర్యంగానే మ్యాచ్ ఆడేందుకు కోర్టులోకి దిగాడు. అసలు తిరకాసు ఇక్కడే ఉందిమరి... వింబుల్డన్ రూల్స్ ప్రకారం ఈ మ్యాచ్ కు తప్పని సరిగా తెల్ల దుస్తులు వేసుకోవాల్సిందేనట, ఇది దృష్టి లో పెట్టుకున్న క్లిస్టర్స్ వెంటనే తన బ్యాగ్ లో ఉన్న ఓ వైట్ స్కర్ట్ ను తీసి అతనికి తొడిగింది. ఇక అప్పుడు గ్రౌండ్ లో ఉన్న చాలామంది అతనిని చూసి తేగ నవ్వులు కురిపించారట.. క్లిస్టర్స్ అయితే ఏకంగా కిందపడిమరి నవ్వుకున్నారు. స్కర్టే కాదు టాప్ కూడా వేసుకున్న ఆ అభిమాని ఓ పాయింట్ కూడా ఆడాడు. ఆ స్టేడియం చుట్టూరా ఉన్న ప్రేక్షకులంతా చప్పట్లతో ఎంజాయ్ చేశారు. గతంలో ఛాంపియన్లుగా నిలిచిన మాజీ ప్లేయర్లతో వింబుల్డన్ లో ఇన్విటేషనల్ టోర్నీ నిర్వహిస్తారు. ఆ టోర్నీలోనే ఈ ఘటన జరిగింది. ఆ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడీయాలో చక్కర్లు కొడుతుంది.