డ్రగ్స్ కేసు పై అనూహ్య నిర్ణయం ..

SMTV Desk 2017-07-15 16:00:07  TAGS AKUN SABARWAL , DRUGS CASE , TELANGANA , DRUGS , POLICE

హైదరాబాద్, జూలై 15 : తెలంగాణ రాష్ట్రాన్ని బూతంలా పట్టి పీడిస్తున్న డ్రగ్స్ కేసు మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ కేసు తీవ్రత దృష్యా ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తన సెలవులను రద్దు చేసుకున్నారు. డ్రగ్స్ కేసు విచారణ పూర్తయ్యే వరకు సెలవులను వాయిదా వేసుకున్నట్లు ఆయన శనివారం ఉదయం ప్రకటించారు. ఇవాళ ఉదయం ఓ మీడియా తో ఫోన్లో మాట్లాడుతూ.. తన సెలవులపై వదంతులు వస్తున్న నేపథ్యంలోనే సెలవులు రద్దు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు డ్రగ్స్ రాకెట్ ముఠాపై ఉక్కుపాదం మోపనున్నామని, అలానే డ్రగ్స్ ను ప్రోత్సహించిన వారి పై కూడా కఠిన చర్యలు తప్పవని సబర్వాల్ స్పష్టం చేశారు. ఈ డ్రగ్స్ ను తొలగించి తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని, అవసరమానుకుంటే పోలీస్ సాయం తీసుకుంటామని అన్నారు. ఈ డ్రగ్స్ చెలామని చేసేవారిపై ఎైక్సెజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. 30 రోజులుగా కూపీ లాగుతూ, డ్రగ్స్ రాకెట్ మూలాలను ఛేదించే ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. ఇప్పటివరకు ముఠాలోని 13 మందిని అరెస్టు చేసి వారి మొబైల్ కాల్‌డాటా ప్రకారం కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించామని తెలిపారు. డ్రగ్స్ కేసులో పక్కా ఆధారాలతో ఇప్పటివరకు సినిమారంగానికి చెందిన 12 మందికి నోటీసులు జారీ చేశామని, ఈ నెల 19 నుంచి విచారణ ప్రారంభమవుతుందని వెల్లడించారు. నోటీసులు అందుకున్నవారంతా రోజుకొక్కరు చొప్పున విచారణకు ఎైక్సెజ్ సిట్ ముందు హాజరుకావాలని తెలియజేశారు.