తెలుగు అనౌన్స్ మెంట్ల ద్వారా విమానాల రాకపోకల వివరాలు

SMTV Desk 2017-05-29 18:28:18  eroplain,announcement,telugug announcement

అమరావతి, మే 29 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో ఇంగ్లీష్ , హింది తో పాటు తెలుగులో కుడా అనౌన్స్ మెంట్లు చేసే విధంగా ఆదేశాలు జారిచేస్తామని కేంద్ర పౌరవిమాన యాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు స్పష్టం చేశారు. ఎయిర్ లైన్స్ మరియు ఎయిర్ పోర్టులలో తెలుగు అనౌన్స్ మెంట్లు నిర్వహించాలని డిప్యూటి స్పీకర్ బుద్దిప్రసాద్ ఇచ్చిన లేఖకు ఆయన ఈ మేరకు స్పందించారు. దేశంలోని అనేక భాషలు ఉన్నందున అన్ని భాషలలో క్రూ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం సాధ్య పడక పోవచ్చునని..ఆ దరిమిలా అంతర్గత విమానాలలోనే తెలుగు అనౌన్స్ మెంట్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎయిర్ పోర్ట్ అథారిటి అఫ్ ఇండియా నిర్వహణలో కోనసాగుతున్నవిశాఖ పట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప ఎయిర్ పోర్టులలో హింది, ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కుడా అనౌన్స్ మెంట్ ఉంటుందని వివరించారు. రైల్వే స్టేషన్ లలో మాత్రమే తెలుగు, హింది, ఇంగ్లీష్ లలో అనౌన్స్ మెంట్లు కోనసాగుతుండగా ....ఎయిర్ పోర్టులలో ఇంగ్లీష్, హిందీలలో అనౌన్స్ మెంట్లు నిర్వహిస్తున్నారు.