ఆడపిల్ల పుట్టిందని

SMTV Desk 2017-07-15 14:41:16  woman,beaten,hockey,stick,brother,inlaw,girl,dowry,

పంజాబ్,జూలై 15 : పంజాబ్ లోని పాటియాలాలో దారుణం....తాజా నివేదికల ప్రకారం మీనా కశ్యప్,దల్జీత్ సింగ్ కు రెండేళ్ల క్రితం పెళ్లి అయింది. ఆయన దగ్గర్నుంచి అత్తింటివారు మీనాను కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ఈ విషయామే గత ఏడాదిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశామని, కాని ఎలాంటి ఫలితంలేదని మీనా తండ్రి వాపోయారు. రూ.7లక్షలు కట్నాన్ని డిమాండ్ చేశారని తెలిపారు. ఈ వేధింపులు మితిమీరడంతో మీనా,దల్జీత్ అదనపు కట్నం డిమాండ్ చేస్తూ వేరు కాపురమున్తున్నారు. ఇంతలో మీనా ఈ మద్యనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టిందనే నెపంతో అమానుషానికి పాల్పడిందో కుటుంబం. సమీప బంధువు, దీన్నిసాకుగా చేసుకున్న ఆ కుటుంబం మరింత రెచ్చిపోయింది. దల్జీత్ సోదరుడు అతని స్నేహితుడు ఆమెను హాకీస్టిక్ లతో అతి దారుణంగా కొట్టారు. ] హృదయం విదారకంగా అరిచి గగ్గోలు పెడుతున్నా ఎంత వేడుకున్నా వదలిపెట్టలేదు. బహిరంగంగా ఆమెపై ఆ దుర్మార్గాలు దారుణంగా దాడి చేస్తోంటే అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సోషల్ మీడియాలో వీడియో ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఇద్దరు నిందుతులను అరెస్ట్ చేశారు .ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.