పేటీఎం దూకుడు..

SMTV Desk 2018-07-09 12:12:26  paytm wallet, paytm app, cash less transcations, mumbai

ముంబై, జూలై 9 : నోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీలు బాగానే పెరిగాయి. అందులో చెల్లింపుల యాప్‌ పేటీఎం నెలవారీ నగదు వ్యవహారాలు రూ.27వేల కోట్లను (4బిలియన్‌ డాలర్లు) దాటాయి. మొత్తం 130కోట్ల వ్యవహారాలు ఈ యాప్‌ ద్వారా జరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ కేవలం రూ.6,800కోట్లు మాత్రమే. వీటిల్లో రీఛార్జిలు, బిల్లు చెల్లింపులు, వ్యక్తులకు నగదు బదిలీ, కొనుగోళ్లు ఉన్నాయి. వీటిల్లో నెఫ్ట్‌ , డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వ్యవహారాలను మినహాయించారు. జనవరి 2018 నుంచి పేటీఎం భారత్‌ ఇంటర్‌ఫేజ్‌ ఫర్‌ మనీ యూపీఐ నగదు వ్యవహారాలను వేగవంతం చేసింది. ఈ కాలంలో దాదాపు 40కోట్ల ట్రాన్సాక్షన్స్‌ చేసింది. "పేటీఎం ద్వితీయశ్రేణి, తృతీయశ్రేణి నగరాల్లో వేగంగా విస్తరిస్తోంది. మొత్తం వినియోగదారుల్లో 50శాతం ఈ ప్రాంతాల వారే ఉన్నారు. దీంతో వార్షిక నగదు వ్యవహారాలను 5బిలియన్‌ డాలర్లకు చేర్చాలన్న కంపెనీ లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటోంది. దీనికి తోడు స్థానిక భాషల్లో పేటీఎం ఉండటం మాకు అనుకూలించే అంశం. హిందీ, ఇంగ్లీష్‌, గుజరాతీ, తెలుగు మరాఠీ భాషలను ఎక్కువగా వాడుతున్నారు" అని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.