మాఫీయాతో రాజధానికి చెడ్డపేరు

SMTV Desk 2017-07-15 13:36:36   bjp, k Laxman, mafia,

హైదరాబాద్, జూలై 15 : గత కొంతకాలంగా నగరంలో చెలామని అవుతున్న మద్యం, డ్రగ్స్ మాఫీయాతో రాజధానికి చెడ్డ పేరు వస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. చెడ్డపేరు రాకుండా చూడటం బీజేపీ యువతతోనే సాధ్యమవుతుందని ఆయన వెల్లడించారు. శుక్రవారం రోజున టీఆర్ఎస్ కు చెందిన కొందరికి ఆయన బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తులు చేసే ఆగడాల మూలాన మొత్తం పరిశ్రమకే ముప్పు వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. అలానే టీఆర్ఎస్ ప్రభుత్వం మూడేండ్ల పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, విద్య, ఉపాధి, వ్యవసాయ రంగాలు నిర్వీర్యమైపోయాయని ఆయన విమర్శించారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని, విద్యార్ధులు కూడా డ్రగ్స్ కు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంచి నీరు ఇవ్వండని ప్రజలు అడుగుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అడగకున్నా బారు, బీరు ఇస్తోందన్నారు. పాతబస్తీ అభివృద్ధికి ఎంఐఎం అడుగడుగునా అడ్డుతగులుతోందని, ఆ పార్టీని ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందన్నారు.