జన్‌ధన్ ఖాతాదారులకు శుభవార్త..

SMTV Desk 2018-07-08 13:40:26  prime minister modi, Jan Dhan Yojana, free accident insurance

న్యూఢిల్లీ, జూలై 8 : జన్‌ధన్ ఖాతాదారులకు శుభవార్త. కేంద్రం 15 నుంచి పది కోట్ల కుటుంబాలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బీమా అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈ బీమాకు సంబంధించిన విధివిధానాలను కేంద్ర వెల్లడించలేదు. కానీ జన్ ధన్ ఖాతాలతో ఈ పథకానికి సంబంధం ఉంటుందని ఆర్థిక శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 32 కోట్ల మందికి జన్‌ధన్‌ ఖాతాలున్నాయి. రూపే కార్డు వాడుతున్న 24 కోట్ల మంది ఉన్నారు. వీరంతా ఇప్పటికే బీమా పరిధిలో ఉన్నారు. కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న సురక్ష పాలసీని జన్ ధన్ ఖాతాదారులకు అందించనున్నారు. సురక్ష పాలసీలో ఏడాదికి రూ. 12 చెల్లించడం ద్వారా.. రూ. 2లక్షల కవరేజీతో బీమా పాలసీని తీసుకోవచ్చు. ఇప్పుడు అదే తరహాలో రూ.12 లను జన్ ధన్ ఖాతాదారులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే.. ఇందుకోసం జన్‌ధన్‌ ఖాతాదారులు చేయాల్సిందల్లా మూడు నెలల్లో కనీసం ఒక్కసారైనా రూపే కార్డును వినియోగించి ఉండాలని పేర్కొన్నారు.