డీఎస్పీ అనే నేను.. యూఎస్ఏ వస్తున్నాను..

SMTV Desk 2018-07-08 11:26:42  devisri prasad, us stage performance, sukumar, samantha.

హైదరాబాద్, జూలై 8 : సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌.. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో దుమ్మురేపే పాటలకు కేరాఫ్‌ అడ్రస్‌‌. వెండితెరపైనే కాదు, లైవ్‌ షోలలోనూ అదరగొట్టే దేవిశ్రీ యూఎస్‌ఏలో వరుస ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఎంట్రీతో ప్రారంభమై౦ది. ఈ వీడియోలో.. "అమెరికా దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి. మీ అందరి చెవుల్లో సంగీతాన్ని నింపడానికి మా డీఎస్పీ వచ్చేస్తున్నాడు.. మరే, ఫ్లైటెక్కొచ్చేస్తున్నాడు. ఆడి పాడి అలరించేస్తాడంతే.. మీరందరూ రెడీగా ఉండండి. అమ్మా, డీఎస్పీ.. వచ్చేయమ్మ నువ్వు" అంటూ లుంగీ చొక్కా, కళ్లద్దాలు ధరించిన సుకుమార్ చెప్పడం ఆసక్తిదాయకంగా ఉంది. ఆగస్టు 11 నుంచి సెప్టెంబరు 16 వరకు అమెరికాలోని ఆరు నగరాల్లో ఈ కన్సర్ట్ నిర్వహించనున్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోనూ దేవీ శ్రీ స్వయంగా డైరెక్ట్‌ చేశారు. ఇందులో సుకుమార్ నటించగా.. దేవిశ్రీ దర్శకత్వం వహించాడట. అంతేకాదు హీరోయిన్ సమంత చేతుల మీదుగా రిలీజ్ చేశారు. >> దేవిశ్రీ షో వివరాలు ఇలా ఉన్నాయి.. * ఆగస్టు 11న సియాటెల్‌(సాయంత్రం 6.00గం.) * ఆగస్టు 18న చికాగో(సాయంత్రం 6.00గం.) * ఆగస్టు 25న డెట్రాయిట్‌(సాయంత్రం 6.00గం.) * సెప్టెంబరు 1న డల్లాస్‌((సాయంత్రం 6.00గం.) * సెప్టెంబరు 8న న్యూజెర్సీ(సాయంత్రం 5.00గం.) * సెప్టెంబరు 16న శాన్‌జోస్‌ (సాయంత్రం 5.00గం.)లలో దేవిశ్రీ ప్రదర్శన ఇవ్వనున్నారు.