బఫెట్‌ను దాటేసిన ఫేస్‌బుక్‌ అధినేత..

SMTV Desk 2018-07-07 13:13:35  mark zuckerberg, mark zuckerberg top 3, face book, blum burg

శాన్‌ఫ్రాన్సిస్‌కో, జూలై 7: ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్ ప్రఖ్యాత అమెరికన్‌ వ్యాపారవేత్త వారెన్‌ బఫెట్‌ను అధిగమించాడు. ఓ వైపు కేంబ్రిడ్జ్‌ అనలిటికా డేటా స్కాండల్‌, మరోవైపు యూజర్ల ప్రైవసీపై ఆందోళనలు ఫేస్‌బుక్‌ను తీవ్ర ఇరకాటంలో పడేసినప్పటికీ, ఆ కంపెనీ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా శరవేగంగా దూసుకుపోయింది. ప్రపంచ సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో అమెజాన్‌. కామ్‌ వ్యవస్థాపకులు జెఫ్‌ బెజోస్‌ ఉండగా, రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ ఉన్నారు. శుక్రవారం ఫేస్‌బుక్‌ షేర్లు 2.4శాతం పెరగడంతో జుకర్‌బర్గ్‌ ఆస్తి పెరిగిపోయి సంపన్నుల జాబితాలో మూడోస్థానానికి చేరారని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. సంపన్నుల జాబితాలో మొదటి మూడు స్థానాల్లోనూ టెక్నాలజీ సంస్థల అధినేతలే ఉండడం ఇదే తొలిసారి అని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. ఒకప్పుడు ప్రపంచంలో అత్యధిక సంపన్న వ్యక్తిగా ఉన్న బఫెట్‌ ఆస్తి తగ్గిపోతూ వస్తోంది. ఎందుకంటే ఆయన పెద్ద మొత్తంలో డబ్బును ఛారిటీలకు అందిస్తున్నారు. 290 మిలియన్‌ డాలర్ల విలువ చేసే బెర్క్‌షైర్‌ హత్‌వే క్లాస్‌ బీ షేర్లను బఫెట్‌ ఛారిటీలకు ఇచ్చారు.