మిథాలి రాజ్ కు అభినందనలు తెలిపిన సిఎం

SMTV Desk 2017-07-14 19:16:51  Mithali Raj, congratulates, the, CM

హైదరాబాద్, జూలై 14 : మహిళా వన్డే క్రికెట్ లో అత్యధికంగా 6 వేల పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా మిథాలి రాజ్ నిలిచారు. ఈ సందర్బంగా మిథాలి రాజ్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభినందించారు. 'మహిళా వన్డే క్రికెట్ లో 6 పరుగులు చేసి గొప్ప విజయం సాధించారు. మహిళా క్రికెట్ జట్టు సారధిగా ఆమె మరిన్ని విజయాలు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలవాలని.' ఆయన అన్నారు.