అత్యాచారం పై ఉబర్ డ్రైవర్ అరెస్ట్

SMTV Desk 2017-07-14 18:18:20  brisbane,uber,driver,sexually,assault,

బ్రిస్బేన్,జూలై 14 : మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉబర్ డ్రైవర్(37) ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...తూర్పు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జూలై 8 న (16) ఏళ్ల బాలిక ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. మార్గం మధ్యలో క్యాబ్ డ్రైవర్ ఆమెను లైంగికంగా వేధించాడు. నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం ఉబర్ డ్రైవర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారం రోజుల్లో ఇది రెండో అరెస్ట్ కేసు అని క్వీన్స్‌లాండ్ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ఈ కేసుపై సమాచారం అందుకున్న ఉబర్ సంస్థ ఆ క్యాబ్ డ్రైవర్ లైసెన్స్‌ను రద్దు చేసింది. బ్రిస్బేన్ మేజిస్ట్రేట్ కోర్టులో నిందితుడిని ప్రవేశ పెట్టగా తదుపరి విచారణ వరకు కస్టడీకి తీసుకోవాలని సూచించింది.