గాంధీ కోసం మాట్లాడి.. గాడ్సేను అనుసరిస్తారా..

SMTV Desk 2018-07-05 15:13:03  rahul gandhi about rss, congress president rahul gandhi, rss, gst, delhi

ఢిల్లీ, జూలై 5 : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఆర్‌ఎస్ఎస్ నేతలపై మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ నేతలు మహాత్మా గాంధీ గురించి మాట్లాడుతు.., నాథూరాం గాడ్సేను అనుసరిస్తారని విరుచుకుపడ్డారు. అమేథీలో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సైబర్ టీమ్‌తో జరిగిన సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ... హిందూత్వ సంస్థలు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జాతీయోద్యమంతోపాటు దేశం కోసం జరిగిన అన్ని పోరాటాల్లోనూ కాంగ్రెస్ నేతలు కీలక పాత్ర పోషించారని.. స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమాత్రం లేకపోయినా కానీ, చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియా విభాగం మరింత చురుకుగా వ్యవహరించి, ఆర్ఎస్ఎస్ ప్రచారాన్ని సమర్థవంతంగా తప్పికొట్టాలని రాహుల్ గాంధీ సూచించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. బుల్లెట్ రైలు గురించి ప్రధాని ఇచ్చే వాగ్దానాలన్నీ నెరవేరవరవని అన్నారు. "అది బుల్లెట్ రైలు కాదు.. ఇదో మ్యాజిక్ రైలు.. అది ఎప్పటికీ పూర్తికాదు.. ఒకవేళ అలా జరగాలంటే కాంగ్రెస్ పాలనకే సాధ్యమని రాహుల్ హేళన చేశారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో ప్రజల జేబుల నుంచి డబ్బు లాక్కుని విజయ మాల్యా, నిర్వాన్ మోదీలు దేశం నుంచి పారిపోయారని అన్నారు.