ఫిలింనగర్, జూలై 14 : అక్కినేని నాగచైతన్యతో కలిసి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది హీరోయిన్ సమంత. అక్టోబర్ 6న వీరి వివాహం జరుగనుంది. కాగా ఇటీవల ట్విట్టర్‌లో సమంతకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ‘మీరు ఎప్పుడైనా నాగచైతన్య ఫోన్ చెక్ చేశారా?’ అని ఓ అభిమాని ఆమెను ప్రశ్నించాడు. సమంత స్పందిస్తూ "చెక్ చేయలేదు అలా చేయడం చాలా తప్పు. అమ్మాయిలు అబ్బాయిల ఫోన్ చెక్ చేయడం, అబ్బాయిలు అమ్మాయిల ఫోన్ చెక్ చేయడం అనేది నా దృష్టిలో బ్యాడ్ హ్యాబిట్. భార్యాభర్తలైనంత మాత్రాన ఇద్దరి అభిరుచులు కలవాలని లేదు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటే ఆ బంధం బాగుంటుంది. వ్యక్తిగత జీవితానికి ఎవరి స్పేస్ వాళ్లకి ఉండడం చాలా అవసరం" అని చెప్పింది.