అమెజాన్ లో మెగా ప్రైమ్ డే సేల్..!!

SMTV Desk 2018-07-03 17:07:13  amazon, mega discount sale in amazon.

హైదరాబాద్, జూలై 3 : ప్రముఖ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. వినియోగదారులకు మరో భారీ డిస్కౌంట్ తో మెగా ప్రైమ్ డే సేల్ ను ప్రారంభించనుంది. ఈ నెల 16న ప్రారంభించనున్న ఈ సేల్ 16 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మొదలయ్యే విక్రయాలు మరుసటిరోజు అర్ధరాత్రి 11.59 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది ప్రముఖ బ్రాండ్ల నుంచి 200 ఉత్పత్తులు ప్రత్యేకంగా అమెజాన్ సైట్లో విడుదల కానున్నాయి. ఈ డీల్స్ ను తక్కువ ధరలకే సొంతం చేసుకోవచ్చని అమెజాన్ ఇండియా మేనేజర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ తెలిపారు. రోజువారీ నిత్యావసరాలు, ఫ్యాషన్ ఉత్పత్తులను ఏడాదిలోనే అత్యంత తక్కువ ధరలకు ప్రైమ్ సేల్ లో ఆఫర్ చేయనుంది. ఈ సేల్ లో భాగంగా రెండు గంటల్లో డెలివరీ సర్వీస్ ను కూడా అమెజాన్ పరీక్షించనుంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నిత్యావసరాలను ఆర్డర్ చేసిన రెండు గంటల్లోపు అందించనుంది.