భూబకాసురులు...వెలుగు చూసిన వేల కోట్ల కుంభకోణం..

SMTV Desk 2017-05-29 17:20:33  miypur land grabbing,10 thousend crore frade,

హైదరాబాద్, మే 29 :భూ బకాసురుల గుట్టురట్టయింది. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను అప్పనంగా లాగించేశారు. పదివేల కోట్ల రూపాయల భూ కుంభకోణంగా అంచనాలు వెల్లడవుతున్నాయి. సూత్రదారులలో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రావు, మరో ఇద్దరిని పోలిసులు అరెస్ట్ చేసి విచారణ కోనసాగిస్తున్నారు. శేరిలింగం పల్లి మండలం మియాపూర్ లో ఈ భూ కుంభకోణం వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గత ఐదారు సంవత్సరాలుగా డిమాండ్ పేరగడంతో ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్నుపడింది. ఎకరా 14 కోట్ల వరకు ధర పలుకుతు ఎక్కడా లేని డిమాండ్ ఉండడంతో సర్వశక్తులు ఓడ్డారు.ఆ పరిసర ప్రాంతాల్లో మెుత్తం 693 ఎకరాల ప్రభుత్వ భూములను తమ పేర రిజిస్ట్రేషన్ చేయించుకోని ప్రభుత్వానికి కుచ్చుటోపి పెట్టారు. రేవెన్యూ అధికారులు, సబ్ రిజిస్ట్రార్ తో పాటు పలువురు అక్రమార్కులు ఈ కేసులో ప్రధాన నిందితులని వెల్లడవుతున్నది. 14 కోట్ల రూపాయల ధర పలుకుతుండడంతో ఓక్కో ఎకరాకు 2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి భూములను హాం ఫట్ మనిపించారు. 693 ఎకరాలకు ప్రభుత్వ నిర్ద్యేశిత ధర ప్రకారం 587 కోట్ల నష్టం కాగా ,బహిరంగ మార్కెట్లో వాటి విలువ సుమారు 10 వేల కోట్లకు పైగానే అని అంచనాలు వెల్లడవుతున్నాయి.