కాలిబాట భక్తులకు టైం స్లాట్‌ నిర్ణయించిన టీటీడీ

SMTV Desk 2017-07-14 15:06:27  ttd,walking,devotees,tirumala,

తిరుమల, జూలై 14 : తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించేందుకు కాలినడకన వస్తుంటారు. అయితే ఇక వారాంతం (శుక్ర, శని, ఆది)లో కాలినడకన దివ్యదర్శనం రద్దు అమలు చేయ్యనున్నట్లు టీడిడి అధికారులు వెల్లడించారు. దీనివల్ల ఆ మూడురోజుల్లో నడిచివచ్చిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శనం, లడ్డూ టోకెన్లు జారీ చెయ్యరని తెలిపారు. తిరుమలలో పెరుగుతున్న రద్దీ కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. నడిచి వచ్చిన భక్తుల రూ. ౩౦౦ టికెట్ల తరహాలోనే టైం స్లాట్ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ నెల 17 వ తేదీన సోమవారం నుంచి శ్రీవారి కాలినడకన దివ్యదర్శనాన్ని ఇకపై టైం స్లాట్ లో కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. రూ . ౩౦౦ టికెట్ల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటకు 25౦౦ మంది భక్తులకు కేటాయించి సజావుగా శ్రీవారిని దర్శనం చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల క్యూలైన్లు కనిపించవు. రోజులో 20వేల మంది కాలినడక భక్తులకు టైం స్లాట్‌ కేటాయించనున్నారు. ఈనెల 16న తిరుమల శ్రీవారి సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు.