వైరల్ : మిర్రర్ ముందు డ్యాన్స్ చేసిన ధావన్‌-పాండ్య..

SMTV Desk 2018-07-02 13:14:13  shikhar dhawan pandya dance, dhawan pandya dance, eengland, virat kohli

మాంచెస్టర్‌, జూలై 2 : టీమిండియా క్రికెటర్లు శిఖర్‌ ధావన్‌, హార్దిక్‌ పాండ్య ఎక్కడ ఉంటే అక్కడ హడావిడే వేరు. సహచర ఆటగాళ్లను ఆటపట్టిస్తూ, ఏదో ఒక చిలిపి పని చేస్తూ ఉంటారు. వీరిద్దరికీ డ్యాన్స్‌ అన్నా, పాటలన్నా చాలా ఇష్టం. ఏదైనా కార్యక్రమంలో కలిస్తే ధావన్‌, పాండ్య స్టెప్ లేస్తూ సందడి చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. తాజాగా ధావన్‌-పాండ్య కలిసి డ్యాన్స్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను హార్దిక్‌ పాండ్య తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. "నేను, జట్టా(శిఖర్‌ ధావన్‌ను సహచర ఆటగాళ్లు ఇలాగే పిలుస్తారు) డ్యాన్స్‌ చేస్తూ దొరికిపోయాం. మా ఇద్దరికీ డ్యాన్స్‌, పాటలు పాడటం అంటే చాలా ఇష్టం’ అని పాండ్య పేర్కొన్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఎంత చక్కగా డ్యాన్స్‌ చేస్తున్నారో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని భారత్ ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో భారత్‌ టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య రేపటి నుంచి టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది.