ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి అంతం దిశగా ప్రభుత్వ పంతం!!

SMTV Desk 2017-05-29 17:17:17  transfars,ts employe transfars,correption

హైదరాబాద్, మే 29 : రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతిపై తెలంగాణా ప్రభుత్వం కళ్ళు తేరిచింది. పలు చోట్ల వెలుగు చూస్తున్న అవినీతి, అక్రమాలు ఆ పార్టీ ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతున్నాయి. ముఖ్యంగా పలు ప్రభుత్వ విభాగాల్లో పాతుకుపోయిన అధికారులు,ఉద్యోగులే అవినీతికి అలవాలంగా మారుతున్నారన్న విమర్శలు, ఆదారాలు సయితం బట్టబయలవుతున్నాయి. మియాపూర్ లో సబ్ రిజిస్ట్రార్ వ్యవహారం ఇత్యాది ఉద్యోగుల అవినీతి కంపు ప్రభుత్వాన్ని పట్టుకుంటుందని ముఖ్యమంత్రి కేసిఆర్ అప్రమత్తం అయ్యారు. దీర్ఘకాలంగా పాతుకుపోయిన ఉద్యోగుల స్థాన చలనం కోసమై బదిలీలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసమై వివిధ శాఖల ఉన్నతాధికారులు జాబితాలు రూపోందిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా ఒకే చోట, ముఖ్యంగా రెవేన్యూ సంబంధిత విభాగాల్లో ఉన్న అధికారులను ఆయా ప్రదేశాల నుండి స్థాన చలనం కల్పించనున్నారు. ఇందుకు గాను బదిలీల మార్గదర్శకాలను రూపోందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఉద్యోగులకు, పట్టణ ప్రాంతం ఉద్యోగులకు వెర్వేరుగా మార్కులు ఇవ్వడంతో పాటు వారి సర్వీసు ఆధారంగా మార్కులు ఇచ్చి బదీలీల సందర్భంగా కౌన్సిలింగ్ లో వాటిని పరిశీలించి బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో పనిచేసిన వారికి ఎక్కువ మార్కులు ఇచ్చి కౌన్సిలింగ్ లో అత్యధిక ప్రాధాన్యత లభించనుంది. విద్యాసంవత్సరం ప్రారంభం అవుతున్న దరిమిలా జూన్ 15 లోపు శరవేగంగా బదిలీల ప్రక్రియను కోనసా గించేందుకు సన్నహాలు కోనసాగుతున్నాయి. రెవేన్యూ ఎర్నింగ్ విభాగాలలో రెండున్నర సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఒకే చోట ఉద్యోగుల్ని కోనసాగించరాదన్ననిబంధన ఉన్నా అదే ప్రాంతాల్లో కోనసాగుతున్నారు. ఈ క్రమంలో పై నిబంధనను ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు మరిన్ని పారదర్శకమైన పద్దతులను అవలంబించాలని ముఖ్యమంత్రి అదేశించినట్లు వెల్లడవుతున్నది. ముఖ్యంగా రెవేన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వెల్లడవుతున్నది. బోధన్ వాణిజ్యపన్నుల శాఖలో చోటు చేసుకున్న చలానాల కుంభకోణం వ్యవహారంపై సమీక్షించిన ముఖ్యమంత్రి సుదీర్ఘకాలం ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారానే అవినీతి పెరుగుతున్నదని బదిలీలు చేయాలనే ఆదేశం మేరకు యుద్దప్రాతిపదినక చర్యలు సాగుతున్నాయి.