శ్రీలంక టూర్ కు ద్రావిడ్ వెళ్లరా..?

SMTV Desk 2017-07-14 12:09:01  Dravid, not, going, to, Sri Lanka, tour

న్యూఢిల్లీ, జూలై 14 : ఇటీవల విదేశీ బ్యాటింగ్ కోచ్ గా ఎంపికైన మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ శ్రీలంక తో జరుగుతున్న సిరీస్ కు వెళ్ళరని తెలుస్తుంది. ప్రస్తుతం ద్రావిడ్ అండర్ 19 భారత్ ఏ కి కోచ్ గా వారిని తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. అనిల్ కుంబ్లే రాజీనామాతో బీసీసీఐ సలహ సంఘం రవిశాస్త్రిని ప్రధాన కోచ్ గా, బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ ను, అలాగే విదేశీ బ్యాటింగ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ను ఎంపిక చేసారు. అయితే ద్రావిడ్ సేవలను అవసరమైనప్పుడు మాత్రమే వినియోగించుకోవాలని చూస్తున్నారట. దీనిపై బీసీసీఐ లీగల్ బృందం తర్జన బర్జన పడుతున్నారు. కోహ్లి సేన శ్రీలంక తో 3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. అయితే అదే సమయంలో అండర్ 19 భారత్ ఏ దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్లనుంది. అందువలన శ్రీలంక తో పర్యటనకు ద్రావిడ్ అందుబాటులో ఉండరని సమాచారం.