రేణు ఎంగేజ్‌ మెంట్‌ పై పవన్ కామెంట్..

SMTV Desk 2018-06-26 10:29:42  pawan kalyan, renu desai, renu engagement,

హైదరాబాద్, జూన్ 26 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్.. పవన్ తో విడిపోయిన తర్వాత మరో పెళ్ళికి సిద్దపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమెకు మరో వ్యక్తితో నిన్న నిశ్చితార్థ౦ జరిగిన సంగతి తెలిసిందే. అయితే జీవిత భాగస్వామి ఎవరు అనే విషయాన్ని వెల్లడించకపోయినా.. ఎంగేజ్‌ మెంట్‌ జరిగిన విషయాన్ని మాత్రం తన ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. కాగా రేణు నిశ్చితార్థం జరిగిన సందర్భంగా.. పవన్ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. "మిస్ రేణు.. సంతోషం కోసం కొత్త దశలోకి ప్రవేశిస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు ఆరోగ్యంగా ఉండాలని నేను ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను" అని వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా, రేణు దేశాయ్ నిశ్చితార్థం ఇటీవల ఓ వ్యక్తితో జరుగగా, ఆయన ఎవరన్న విషయం ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతం పవన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది పవన్ అభిమానులు.. రేణు దేశాయ్ ఎక్కడున్నా ఆమె మంచి కోరుకునే వ్యక్తి పవన్.. అని, అసలు రేణుని ఎందుకు వదిలేశారు.. ఇద్దరూ కలిసి ఉంటే బాగుండేదని మరికొందరు కోరుతున్నారు.