రెడ్ మీ ప్రొ6 వచ్చేసిందోచ్..

SMTV Desk 2018-06-25 18:34:57  redmi 6 pro, xiaomi mi 6 pro, china, redmi

చైనా, జూన్ 25 : ప్రముఖ మొబైల్ తయారీదారు షామీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ చైనా మార్కెట్ లోకి విడుదలైంది. ఇప్పటికే విజయవంతమైన రెడ్‌మి నోట్‌ 5ప్రో షియోమీ కంపెనీ రెడ్ మీ 6 ప్రో స్మార్ట్ ఫోన్‌ను విపణిలోకి విడుదల చేసింది. చైనా తర్వాత అతిపెద్ద మొబైల్‌ మార్కెట్‌ అయిన భారత్‌లో ఎప్పుడు ఈ ఫోన్‌ను తీసుకువస్తారనే దానిపై షామీ ఎలాంటి ప్రకటన చేయలేదు. బేసిక్‌ మోడల్‌ 3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్న ఫోన్‌ ధర 999 యువాన్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో సుమారు రూ.10.400. ఇక 4జీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 1,199 యువాన్లు (రూ.12,500)కాగా, 4జీబీ ర్యామ్‌ 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ మొబైల్‌ ధర 1,299యువాన్లు(13,600). ఇప్పటికే రిజస్ట్రేషన్లను ప్రారంభించగా, జూన్‌ 26 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. రెడ్‌మి 6ప్రో నలుపు, నీలం, పసిడి, గులాబీ, ఎరుపు రంగుల్లో లభించనుంది. ముఖ్య ఫీచ‌ర్లివే.. >> ఫోన్‌ కంపెనీ : షావోమి >> మోడల్‌ : రెడ్‌మి 6 ప్రొ >> ఇంటర్నల్‌ మెమోరీ : 16 /32 /64 జీబీ >> ర్యామ్‌ : 2 /3 /4 జీబీ >> డిస్‌ప్లే : 5.84 అంగుళాలు (19: 9 ఆస్పెట్‌ రేషియో) >> కెమెరా : 13 ఎంపీ ప్రైమరీ, 5 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ పోట్రెయిట్‌ మోడ్‌ >> ప్రాసెసర్‌ : 625 స్నాప్‌ డ్రాగన్‌ చిప్‌సెట్‌ >> బ్యాటరీ : 4000 ఎంఏహెచ్‌ >> ఆపరేటింగ్‌ సిస్టమ్‌ : ఎంఐయూఐ 10 ఆధారిత ఆండ్రాయిడ్‌ 8.1