కర్నూలులో రక్తికట్టిస్తున్న కుటుంబ రాజకీయం..

SMTV Desk 2018-06-25 14:53:37  KURNOOL BYREEDY RAJASEKHAR REDDY, NANDIKOTKUR, KURNOOL,

కర్నూలు, జూన్ 25 : కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కుటుంబ రాజకీయం ఉత్కంఠ రేపుతుంది. రాజశేఖర్‌రెడ్డి తమ్ముడు కుమారుడు సిద్దార్థరెడ్డి వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. జగన్ అంటేనే మండిపడే బైరెడ్డి కుటుంబం నుంచి సిద్దార్థరెడ్డి వైసీపీ వైపు వెళ్లడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజశేఖర్‌రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని జిల్లా వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వయాన పెద్దనాన్న అయిన రాజశేఖర్‌రెడ్డి ఆదర్శంగా తీసుకుని సిద్దార్థరెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కొంతకాలం పెద్దనాన్న బాటలో నడిచిన సిద్ధార్థరెడ్డి ఇప్పడు తన పద్ధతి మార్చుకున్నారు. తన రాజకీయ భవితవ్యం కోసం సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొదట్లో టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం సఫలం కాకపోవడంతో కొంతకాలం వేచిచూశారు. మరోవైపు తనపై నమోదైన కేసుల కారణంగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే కడప జిల్లాలోని సమీప బంధువుల ద్వారా వైసీపీలోకి వేళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. బైరెడ్డిని కాదని సిద్ధార్థ జగన్‌కు చేరువవుతుండడంతో వారి కుటంబంలోనూ, అనుచరవర్గంలోనూ ఆందోళన మొదలైంది. బైరెడ్డి కూడా టీడీపీలోకి వెళ్లనున్నారని, తర్వలోనే తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.