ఆర్టీసి బంపర్ ఆఫర్...ప్రచారం లేక నిరుపయోగం...

SMTV Desk 2017-05-29 17:14:45  ts rtc,rtc,city bus,free travel,enivere in city

హైదరాబాద్ , మే 29 :ఆర్టీసి ప్రగతి రథ చక్రం..ప్రభుత్వ నిర్ద్యేశించిన ప్రకారం.. ప్రజలు ముఖ్యంగా ప్రయాణికుల సంక్షేమం కోసమై చిత్తశుద్దితో తన వంతు సేవలు అందిస్తునే ఉంటుంది. లోపం ఎక్కడుందంటే ఆర్టీసి అధికారులు, యంత్రాంగంలోనే ఉందనేది పలుమార్లు తేట తేల్లం అవుతూనే ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్ళే వారు, వెళ్ళి వచ్చే వారికి ఆర్టీసి బంపర్ ఆఫర్ అమలు చేస్తుంది.. అదేంటంటే ఎసి, హైటేక్, డిలక్స్ బస్సులలో సూదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ప్రయాణానికి ముందు, ప్రయాణానికి తరువాత రెండు గంటల పాటు హైదరాబాద్ నగర బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. సదరు ప్రయాణం ప్రయాణికుడికి ఎంతో ఉరట నిస్తుంది. ప్రయోజనం కలిగిస్తుంది. తద్వారా ఆర్టీసి సేవలు మరింత విస్తృతం అవడంతో పాటు ఎంతో అసక్తి ఏర్పడుతుంది. కాని ఈ బంపర్ ఆఫర్ పట్ల ప్రచారం లేదు, సరికదా ఆర్టీసి కండక్టర్ల చిరాకు విసుగు మూలంగా ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కో వాల్సి వస్తుంది. ప్రచారమే లేని బంపర్ ఆఫర్ నిష్ప్రయోజనం కాగా , ఈ విషయం పట్ల అవగాహన లేని ఆర్టీసి అధికారులు, కండక్టర్లు ప్రయాణికుల పట్ల చిరాకుగా వ్యవహరిస్తు వారిని చులకనగా చూస్తు వారిపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసి అధికారులు బంపర్ ఆఫర్ పట్ల ప్రచారం చేయడంతో పాటు ... ఆర్టీసి కార్మికులకు వినయం, విధేయత, మర్యాదకరమైన మాటతీరు నేర్పించాలని పలువురు నివేదిస్తున్నారు.