చిరు సినిమాలో "బన్నీ విలన్"

SMTV Desk 2017-07-13 17:40:29  CHIRANJEEVI, BUNNY, RAAMCHARAN, SURENDER REDDY, UPENDRA, NAYANATAARA, ISHWARYA RAI.

ఫిలింనగర్, జూలై 13 : స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’. డైరెక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం విలక్షణ నటుడు ఉపేంద్రను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ విషయంపై ఉపేంద్రను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో విలన్ పాత్రలో ఉపేంద్ర ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇదివరకు హీరోగా చేసిన ఉపేంద్ర ఇప్పుడు విలక్షణమైన పాత్రల్లో కనిపించేందుకు మొగ్గు చూపుతున్నారు. కాగా చిరంజీవితో ‘ఉయ్యాలవాడ’లో నటించేందుకు ఉపేంద్రను తీసుకోవాలని చూస్తున్నారట. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరో కీలక పాత్రలో మాజీ మిస్ ఇండియా ఐశ్వర్యరాయ్‌ను నటింపచేయాలని చిత్రయూనిట్ భావిస్తోందట. కాగా ఆగస్టు 15 స్వాతంత్ర్యదినోత్సవం రోజున షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.