బిగ్‌బాస్-2లో ఏమైనా జరగోచ్చు..!

SMTV Desk 2018-06-22 19:37:48  big boss-2, big boss season -2, nani, thanish, hyderabad

హైదరాబాద్, జూన్ 22 : నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్‌బాస్ సీజన్‌- 2 రెండో వారం ఆసక్తికరంగా సాగుతోంది. తొలివారం వరకూ బాగానే ఉన్న హౌస్‌మేట్స్ రెండో వారాంతానికి గ్రూపులుగా జట్టుకట్టారు. అంతేకాకుండా హౌస్ లో మెంబెర్స్ మద్య చిన్నపాటి గొడవలు చోటు చేసుకున్నాయి. హోస్ట్‌ నానీ చెప్పినట్లుగానే ఏమైనా జరగొచ్చు.. ఇంకొంచెం మసాలా అన్నట్లుగానే సాగుతోంది. వీటన్నింటిని వివరిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు శుక్రవారం విడుదల చేసిన ప్రోమో అందరినీ అలరించింది. ఈ ప్రోమోలో ఇంటి సభ్యుల మద్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. సామాన్యుల కోటా నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగిపెట్టిన నూతన్‌ నాయుడు, సామ్రాట్‌ల మద్య గొడవ జరిగినట్లు.. ఇంటిలోని వస్తువులను సక్రమంగా ఉంచట్లేదనే విషయంలో ఇద్దరు వాగ్వాదానికి దిగారని తెలుస్తోంది. అంతేకాకుండా నూతన్‌నాయుడు, తనీష్‌ల మద్య కూడా గొడవ జరిగింది. ఇందులో నూతన్‌ నాయుడు ఎక్కువగా మాట్లాడకు అనగా.. స్పందించిన తనీష్‌ ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న గణేష్‌, కౌషల్‌లు తనీష్‌ను ఆపే ప్రయత్నం చేశారు. వీటితో పాటు మేమేమి చేతులకు గాజులేసుకు కూర్చోలేదు అంటూ నూతన్‌ నాయుడు పేల్చిన మాటల తూటాలు నేటి ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి.