శ్రీలంక కెప్టెన్‌పై వేటు..

SMTV Desk 2018-06-20 14:07:06   Dinesh Chandimal, ball tampering Dinesh Chandimal, icc, west indies

దుబాయ్‌, జూన్ 20 : శ్రీలంక కెప్టెన్‌ చండిమాల్‌ బాల్ టాంపరింగ్ చేసిన కారణంగా ఐసీసీ శిక్ష విధించింది. వెస్టిండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా చండిమాల్ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడ్డాడు. దీంతో ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌ అతడిపై ఓ టెస్టు మ్యాచ్‌ సస్పెన్షన్‌ విధించాడు. దీంతో విండీస్‌తో మూడో టెస్టుకు చండిమాల్‌ దూరమయ్యాడు. గత శనివారం సెయింట్ లూసియా టెస్టు మ్యాచ్‌లో భాగంగా శ్రీలంక జట్టుపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ టెస్ట్‌ మ్యాచ్‌లో చండీమాల్‌ బాల్‌ కండీషన్‌ మార్చడానికి ప్రయత్నించాడనే ఆరోపణల ఎదుర్కొన్నాడు. దాంతో వీడియో ఫుటేజీ ఆధారంగా ఈ విషయాన్ని పరిశీలించిన ‘ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌’ను చండిమాల్‌ అతిక్రమించాడని నిర్ధారించి ఈ చర్యలు తీసుకుంది. వెస్టిండీస్‌-శ్రీలంక రెండో టెస్టు డ్రాగా ముగిసింది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ మ్యాచ్‌ ముగిసే సమయానికి 5 వికెట్లకు 147 పరుగులే చేసింది. 117/5తో కష్టాల్లో పడ్డ విండీస్‌ను బ్రాత్‌వైట్‌ (59 నాటౌట్‌), హోప్‌ (39) ఆదుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 253, విండీస్‌ 300 పరుగులకు ఆలౌటయ్యాయి. రెండో ఇన్నింగ్స్‌లో లంక 342 పరుగులు చేసింది.