పాప పుట్టిన నెల రోజుల తరువాత మొదటిసారి చూసిన జడేజా

SMTV Desk 2017-07-13 13:14:45  Jadeja who first saw the birthday of the baby after the birthday

ఇంటర్నెట్ డెస్క్, జూలై 13 : టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన బార్య రివా సోలంకి ని కలిసారు. జూన్ నెలలో పండంటి ఆడపిల్ల కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ పాపకు నిద్యాన అని నామకరణ చేసారు. నెల రోజుల తన కూతురి ని జడేజా మొదటి సారి చూసారు. అయితే రవీంద్ర జడేజా పాప పుట్టే సమయంలో ఆయన చాంపియన్స్ ట్రోపి లో పాల్గొన్నారు. తరువాత వెస్టిండిస్ టూర్ కు వెళ్లి నెల రోజుల తన టూర్ ను ముగించుకొని వచ్చారు. తన చిట్టి తల్లిని చూసి ఆనందంలో మునిగారు. ' ఇప్పుడు తన చిట్టి తల్లితో సమయం గడపాలని అనుకుంటున్నా అంతకు మించి నాకు ఏది ముఖ్యం కాదు , ఇంతకు ముందు ఇంటికి వెళ్ళితే బోర్ కొట్టేది. కాని ఇప్పుడు నాతో ఆడుకోవడానికి నాకు నిద్యాన ఉంది. ఇక తనతో నాకు టైం పాస్ అవుతుంది' అని జడేజా పేర్కొన్నారు.